విద్య
విద్య
-
తల్లికి వందనం:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్తాత్మకమంగా జిల్లా లోని అన్ని పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్ధులకు అందరికి 2025-26 విద్యాసంవత్సరం లో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చొప్పున వారి, వారి తల్లుల బ్యాంకు ఖాతాలలో జమచేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,92,895 మందికి లబ్ధి చేకూరింది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలలో హాజరు శాతం పెరిగేందుకు దోహదం చేసింది.
-
మనబడి మన భవిష్యత్తు:
పాఠశాలలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచుటలో భాగంగా కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని వసతులతో కూడిన పాఠశాలలను “మనబడి మన భవిష్యత్తు” పేరుతో అభివృద్ధి పరచుట జరుగుచున్నది. దీనిలో భాగంగా ఫేజ్ -2 లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదులు కల్పించడం జరుగుచున్నది.
-
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం:
-జిల్లాలోని 1326 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 92.266 మంది విద్యార్థులకు నిర్దిష్ట మెూతో మేలు రకం సన్న బియ్యంతో (పైన్ రైస్) పౌష్టిక ఆహారమును మధ్యాహ్నం భోజన పథకం ద్వారా రుచిగా, శుచిగా అందించడం జరుగుతున్నది. ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగినది.
-
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్:
– ప్రతి విద్యార్థి అభ్యసనలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా సమగ్రమైన అభ్యసన కిట్ ను అనగా బ్యాగు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డిక్షనరీ, 3 జతల ఏకరూప దుస్తులు, ఒక జత షూస్, రెండు జతల సాక్స్, బెల్టు అందజేయడం జరుగుచున్నది. – 2025-2026 విద్యా సంవత్సరానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా అందరూ బాలబాలికలకు కిట్ లను అందించడం జరిగినది.
-
మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 :
డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగులో భాగంగా జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను, SMC సభ్యులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి పాఠశాలలలో ప్రభుత్వం చేపట్టి పలు కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడం జరిగినది.
-
డి.యస్.సి:
D.S.C ద్వారా ఉమ్మడి జిల్లాలో 619 ఖాళీలను భర్తీ చేయడం జరిగినది. అదేవిధంగా అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్ లను కూడా నియమించడం జరిగినది .