పశుసంరక్షణ

  • పశుపోషకులకు నాణ్యమైన మేత మరియు పశువుల దాణా అందించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రముల ద్వారా 120 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనములు @75% సబ్సిడీతో 21,00,000 రూపాయలు సబ్సిడీ వెచ్చించి 4,120 మంది రైతులకు మరియు 520 మెట్రిక్ టన్నుల పశువుల దాణా 50% సబ్సిడీతో 57,20,000 వెచ్చించి 3,466 రైతులకు పంపిణీ చేయుట జరిగినది.

  • 2025-26 సంవత్సరమునకుగాను గొర్రెలు మరియు మేకలలో ఈ కార్యక్రమము క్రింద మొత్తం 13,32,025 జీవాలకు నట్టల నివారణ చేపట్టుట జరిగినది. నట్టల నివారణ కార్యక్రమము ద్వారా జీవాలలో మరణములు శాతం తగ్గించుట మరియు శరీర బరువు పెరుగుట ద్వారా గొర్రెల కాపరులకు మేలు జరుగుతుంది.

    (Accelerated Breed Improvement Programme) క్రింద 2025-26 సంవత్సరంలో లింగ నిర్ధారిత వీర్యం (Sex Sorted Semen) 5,385 పశువులకు చేయటం జరిగినది మరియు ఒక వెయ్యి డెబ్బై ఏడు ఆడ దూడలు పుట్టుట జరిగినది.

  • పశుభీమ పధకం క్రింద జిల్లాలో 2025-26 సంవత్సరమునకుగాను 25,00,000 లక్షల సబ్సిడీ వ్యయంతో 3,216 పశు పోషకులకు మరియు గొర్రెల పెంపకదారులకు లబ్ది చేకూరటం జరిగినది.

  • రాష్ట్రీయ గోకుల్ మిషన్ క్రింద, పశువుల ఉత్పాదకతను పెంచడానికి అన్ని మండలాల్లో 10,60,000 లక్షల రూపాయలు ఖర్చు చేసి 21 సంతానోత్పత్తి శిబిరాలు మరియు 35 దూడల ర్యాలీలు నిర్వహించబడ్డాయి.